![]() |
![]() |

2023 లో వివాదాల నడుమ విడుదలైన 'ది కేరళ స్టోరీ' చిత్రం, వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఎవరూ ఊహించని విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'ది కేరళ స్టోరీ 2' వస్తోంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. (The Kerala Story 2 Trailer)
'ది కేరళ స్టోరీ'లో యువతులకు ట్రాప్ చేసి మతం మార్చడమే కాకుండా, వారిని టెర్రరిస్ట్ గ్రూప్స్ లోకి ఎలా తీసుకెళ్లారు అనేది చూపించారు. ఇప్పుడు 'ది కేరళ స్టోరీ 2'లో అంతకుమించిన చీకటి కథ చూడబోతున్నామని అర్థమవుతోంది.
'వాస్తవ సంఘటనల ఆధారంగా' అంటూ దాదాపు మూడు నిమిషాల నిడివితో 'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్ ను రూపొందించారు. లవ్ జిహాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముగ్గురు యువతులు ప్రేమ మాయలో పడి, తమ జీవితాలను ఎలా చీకటి చేసుకున్నారు అనేది కంటతడి పెట్టించేలా చూపించారు. డార్క్ కంటెంట్, బోల్డ్ సీన్స్ తో ఒక ఎమోషనల్ రైడ్ ని చూడబోతున్నామని ట్రైలర్ తో స్పష్టమైంది.
కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో సన్ షైన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
![]() |
![]() |